ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిబిజికెఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిబిజికెఎస్ నాయకులు మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఎన్నో హక్కులు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్మికవర్గం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి,బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య,భూపతి అశోక్, కానుగంటి చంద్రయ్య, మహిపాల్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీలు జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, శ్రీనివాస్ యాదవ్, ఏరియా నాయకులు నీలం సదయ్య, పొగాకు రమేష్,పిట్ సెక్రెటరీలు మహేందర్ రెడ్డి, మెండె వెంకటి, వెంకటేశ్వరరావు, ఇప్ప భూమయ్య, జంపయ్య, నాయకులు ఒల్లాల రవి, మహేష్ రాజ్, ఉత్తేజ్ రెడ్డి, ప్రసాద్, కాల్వ శ్రీను, శంకరయ్య, తిరుపతి రావు సంతోష్,వెంకటరమణ రెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
26 September 2023
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రముఖ ఇంద్రజాలికుడు, రామకృష్ణాపూర్ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి మ్యాజిక్ భాస్కర్ ను మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో సీసీసీ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, స్థానిక ప్రైవేటు పాఠశాలలు, సింగరేణి పాఠశాలల విద్యార్థులకు మ్యాజిక్ షో ద్వారా పిల్లలను మొబైల్, టీవీల నుంచి దూరం చేస్తూ, మూఢనమ్మకాల నుండి చైతన్య పరిచే దిశలో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, కార్యదర్శి దొనికెన సమ్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, టి.శంకర్, గోసిక మనోజ్, ప్రవీణ్, పెండ్లి సురేందర్, కృష్ణవేణి, రజిత, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రథమ చికిత్స కోర్సులో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైన 24 మంది మహిళా ఉద్యోగులకు ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందని, అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రథమ చికిత్స పై అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో వారికి ప్రథమ చికిత్స శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. శిక్షణ తరగతులు పూర్తిచేసుకుని పరీక్షలో ఉత్తీర్ణులైన సర్టిఫికెట్లు పొందడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, సింగరేణి సంస్థలో మహిళలు అన్ని పనులు చేస్తున్నారని అన్నారు. సంస్థ మహిళా ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. మహిళలు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, డివైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, వృత్తి శిక్షణా కేంద్రం ఎస్వోఎం కల్లూరి వెంకట రామారావు, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా, బీబీ నగర్ లోని అల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్ తో పాటు ప్రత్యేక అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్యులు మన్సుఖ్ మాండవీయ కు ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజ్ గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలలో దాదాపు 10 వేల మంది సింగరేణి విశ్రాంత కార్మికులు వారి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారని, సింగరేణి యాజమాన్యానికి 40 వేల రూపాయలు చెల్లించి సి.పి.ఆర్.ఎం.ఎస్ (కాంట్రిబ్యూటరీ పోస్ట్ మెడికేర్)కార్డ్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగ దంపతులు కొన్ని ఒప్పంద ఆసుపత్రులలో ఎనిమిది లక్షల రూపాయల వైద్య సౌకర్యం వైద్యం పొందుతున్నారని అన్నారు. ఈ ఆసుపత్రులు స్థిర నివాసాలకు దూరంగా ఉండటం వలన అత్యవసర స్థితి లో అధిక రవాణా ఖర్చులు భరించవలసి వస్తుందన్నారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎమ్స్)లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు టి. ఉమాకర్, బి. బానయ్య, జి. పార్థసారథి, ఎం. మధునయ్య, ఎస్.లక్ష్మీ నారాయణ, టి.రాజ్ కుమార్, జి. కనకయ్య, రామ రాజు, నరసింహ రావు, ప్రతాప్ సింగ్, రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై పలువురు యువకులు, మహిళలు బద్రి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఉదయ్ నగర్ లోని యువత, మహిళలు జిల్లా అధ్యక్షులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, బీజేపీ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, యువ మోర్చా నస్పూర్ పట్టణ అధ్యక్షులు కొండ వెంకటేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుర్రే చక్రి, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు సిరికొండ రాజు, బీజేవైఎం నాయకులు అంబాలా సాగర్, కొంతం మహేందర్, మహిళా మోర్చా నాయకురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, రజక సంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ చేరికతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చిందని, వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిపిందని, దేశ్ ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని అన్నారు. 1940 దశకంలో బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు ఎదురు నిలిచిందని, దాదాపు పది లక్షల ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి సభలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, రజక సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్ ప్రకటించి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడకు ముప్పు ఉందన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, కార్మికుల కోసం చేసుకున్న ఒక్క అగ్రిమెంట్ ఉన్న చూపాలన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల కోసం సాధించింది ఏమీ లేదని, మేనేజ్మెంట్ ను అడిగే పరిస్థితి లేదన్నారు. కార్మిక సమస్యల పై అసలు టీబీజీకేఎస్ నాయకులకు అవగాహన లేదన్నారు. ఒక్క రోజు ఉన్న ఉద్యోగం ఇప్పిస్తామన్న టీబీజీకేఎస్ యూనియన్ సంవత్సరం ఉన్న వారికి అవకాశం కల్పించాలన్నారు. 11వ వేజ్ బోర్డ్ వేతన ఒప్పందం పై కోల్ ఇండియా అధికారులు జబల్పూర్ కోర్టులో కేసు దాఖలు చేశారని, కార్మికులకు జీతాలు తగ్గినా, పెరిగిన వేతనాల చెల్లింపు నిలిపివేసినా అక్టోబర్ 5,6,7 తేదీల్లో సమ్మె చేస్తామని, కార్మికవర్గం సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కాలపరిమితి ముగిసిన ఎస్.డి.ఎల్ యంత్రాలను మార్చాలని, ఎస్.డి.ఎల్ యంత్రాల్లో నాణ్యమైన లూబ్రికెంట్ ఆయిల్ వాడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, కాంట్రాక్టు కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఆకుల లక్ష్మణ్, సదానందం, రమేష్, రాజయ్య, సందీప్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాది కాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్ష వాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళు కట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.