మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని జెడ్.పి.ఎస్.ఎస్ పాఠశాలలో 1997- 98 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం మంచిర్యాలలోని రామ సుధ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సందడి చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శంకర్ రావు లను ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శంకర్రావు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత తమను గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ దగ్గర చదివిన విద్యార్థులు పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండటం, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందరూ ఒకచోట కలుసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవహరించిన గడ్డం సత్య గౌడ్, సురిమిళ్ళ రాజశేఖర్, బండం గోపాల్, ముద్దసాని రమేష్, పెట్టం తిరుపతి, చిందం చంద్రశేఖర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Daily Archives