రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ జన్మదిన వేడుకలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ పట్టణంలోని శ్రీ సాయి అంధుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య,కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, జీఎం చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి , పెట్టo లక్ష్మణ్, బ్రాంచ్ నాయకులు ల్యాగాల శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి,మహేందర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, గొర్ల సంతోష్, నాయకులు రమణారెడ్డి, సికొండ రాజయ్య, పులి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
18 October 2023
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి కార్మికులకు లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న నిర్వహించనున్న టోకెన్ సమ్మెను కార్మికులు యూనియన్లకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసి కార్మికవర్గం ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని పై జరిగిన గేట్ మీటింగ్, నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 16వ తేదీన చెల్లించాల్సిన లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్ ను యాజమాన్యం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉంటుందనే భయంతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల వాయిదాకు సర్వ ప్రయత్నాలు చేసిందన్నారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు కార్మికులకు రావాల్సిన 32 శాతం లాభాల వాటాను, పండుగ అడ్వాన్స్ ను ఆపడం దారుణమన్నారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే సంస్థ లాభాలను ఆర్జించడంతో లాభాల వాటా పుట్టిందని, ప్రతి సంవత్సరం కార్మికులకు లాభాల నుండి వాటాను తీసుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాకు సంబంధమేంటని ప్రశ్నించారు. యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కార్మికులకు రావాల్సిన డబ్బుల చెల్లింపు నిలిపి వేసిందన్నారు. ఎన్నికల కోడ్ కు ముందే యాజమాన్యం కార్మికులకు ఈనెల 16వ తేదీన లాభాల వాటా 32 శాతం చెల్లిస్తామని ఈ నెల 4వ తేదీన సర్క్యూలర్ విడుదల చేసిందని గుర్తు చేశారు. లాభాల వాటా కార్మికులకు చెల్లించకూడదని ఎన్నికల కోడ్ లో ఎక్కడ లేదన్నారు. కార్మికులు తీసుకునే లాభాల వాటా ప్రభుత్వ పథకం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు అవుతూ ఉంటే కార్మికుల లాభాల వాటాను నిలిపివేయడం యాజమాన్యం కుట్రలో భాగమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే కార్మికులకు చెల్లించాల్సిన 32 శాతం లాభాల వాటా తో పాటు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని, లేనిపక్షంలో అవసరమైతే నిరవధిక సమ్మె కైనా వెనుకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రేక్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు మల్లేష్, మారపల్లి సారయ్య, రవీందర్, లక్ష్మణ్, మల్లికార్జున్, గండి సతీష్, సత్తయ్య, యాదగిరి, రాజం, శ్రీనివాస్, సదానందం, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓసిపి కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు:
1. అన్ ఫిట్ లెటర్ మరియు జీతం చిట్టి.
2. కుటుంబ సభ్యుల (భార్య, కుమారులు, కుమార్తెలు) పేర్లు, వయస్సు, సెల్ నెంబర్లు.
3. ఇద్దరు సాక్షుల జీతం చిట్టి జిరాక్స్, రిటైర్మెంట్ తేది మరియు సెల్ నెంబర్లు.
ఫోటోలు:
1. సాక్షులతో దిగిన గ్రూప్ ఫొటోలు – 3 (Size: 4 X 3 Inches)
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు (ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో రెన్యువల్ చేయాల్సిన) లైఫ్ సర్టిఫికెట్ మరియు హెల్త్ కార్డు రెన్యువల్ సౌకర్యం కలదు.
కావాల్సిన డాకుమెంట్స్:
1. PPO నెంబర్
2. బ్యాంక్ అకౌంట్ నెంబర్
3. హెల్త్ కార్డు నెంబర్
4. ఆధార్ కార్డు
5. మొబైల్ నెంబర్
మీకు కావలసిన అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఒకే చోట:
డిటిపి, కలర్ జిరాక్స్, లామినేషన్, ఇంటర్నెట్, ఆన్ లైన్ అప్లికేషన్స్, పాన్ కార్డ్ సర్వీస్, క్యాష్ విత్ డ్రా, మనీ ట్రాన్స్ ఫర్, ఆధార్ డౌన్ లోడ్, పివిసి ఐడి కార్డ్స్, జీవన్ ప్రమాన్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్), ఐటి రిటర్న్స్ ఈ-ఫైలింగ్, నోటరీ, స్టాంప్ (బాండ్) పేపర్స్ లభించును, వెహికిల్ ఇన్సూరెన్స్, వాయిస్ ఓవర్ సర్వీస్, బస్ & ట్రైన్ టికెట్ బుకింగ్, స్పైరల్ బైండింగ్, Paytm KYC.
కస్టమర్లకు గమనిక: మీకు ప్రూఫ్ ఇచ్చిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోగలరు. ప్రూఫ్ చూసుకున్న తర్వాత వచ్చు తప్పులకు మా బాధ్యత లేదు, ఎటువంటి వాదనలకు తావు లేదు.
– వెజ్ నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షం
– అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమా?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ గీతా భవన్ ఉడిపి హోటల్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబంతో కలిసి గీత భవన్ వచ్చిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బాధితుడు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. ఏసీ సెక్షన్ లో వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేయగా, కొంత సమయానికి వెయిటర్ తీసుకొచ్చిన వేసిన నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షమైంది. దీంతో వెజ్ నూడిల్స్ తినడానికి వచ్చిన వారు కంగు తిన్నారు. సదరు హోటల్ సిబ్బందిని పిలిచి వివరణ అడగగా మీరు తింటూ ఉండగా గాలికి వచ్చి పడి ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తినే సమయంలో ఈగ వచ్చి పడిందంటే హోటల్ లో శుభ్రత పాటించడం లేదని సిబ్బంది అంగీకరించినట్టే కదా. వెజ్ నూడిల్స్ ఉన్న ప్లేట్ ను పరిశీలించగా అందులో ఉన్న ఈగ ఆయిల్ లో పూర్తిగా ఫ్రై అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. హోటల్ యజమానిని పిలవమని సిబ్బందిని అడగగా హోటల్ యజమాని ఊర్లో లేడని, మా యజమాని ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదని హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మీకు కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే ఏదైనా ఇస్తామని బదులిచ్చారు. కనీస నాణ్యత ప్రమాణాలు, శుభ్రత పాటించడం లేదని, ఏసీ సెక్షన్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. వెంటనే మంచిర్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే హోటల్ యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మంచిర్యాల జిల్లాలోని పలు హోటళ్లపై అత్యవసరంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో, హోటళ్ల నిర్వహణ తీరులో ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి.
భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ మతాచారాల ప్రకారం పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. ప్రత్యేకంగా దసరా నవరాత్రులలో పూల పండుగ “బతుకమ్మ” గొప్పగా ఆడపడచులు జరుపుకుంటారు. తెలంగాణా రాష్ట్రంలో విభిన్న రాష్ట్రాల నుంచి వలస వచ్చిన బిహారీలు ఛట్ పూజ, బెంగాళీలు దుర్గా పూజ, మలయాళీలు ఓనమ్, మరాఠీలు గుడ్ పావ్, గణేష్ చవితి ,ఒడిశా వారు జగన్నాథ్ రథయాత్ర జరుపుకుంటారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం శ్రీ భగవద్రామానుజులు వారు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కొరకు తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రం శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతి కి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలకు వైష్ణవత్వం బోధిస్తూ వారిని శిష్యులుగా గుర్తించి మంత్రోపదేశం చేయడంతో అట్టి శిష్యులు గురుదక్షిణ క్రింద వైష్ణవ గురువులకు భూమి దానం చేయడంతో అట్టి భూమి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఈ వైష్ణవ గురువులలో శ్రీ కూరత్తళ్వార్ సంబంధికులు శ్రీ వేద వ్యాస, శ్రీ పరాశర, ఆళవందార్, మఠతమ్మాళ్, తిరునంతల్వార్, అమ్మింగి అమ్మాళ్, కిడాంబి వంశస్తులు ఈ శరన్నవరాత్రులు విభిన్న రీతిలో జరుపుకుంటారు. ప్రస్తుతం ఈ కుటుంబాలు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ వేదవ్యాస వంశస్తుల్లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లిలో జన్మించిన వారిలో చలన చిత్ర రచయిత దర్శకులు జె.కె భారవి, శ్రీ రంగ భట్టర్ ముఖ్యులు. తెలంగాణ రచయితలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు కూడ శ్రీ వైష్ణవ మతస్తులే. ఆశ్వయుజ పాడ్యమి నాడు వారి ఇండ్లలో చెక్క బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని ఉదయం, సాయంత్రం అట్టి బొమ్మల కొలువుకు హారతి ఇస్తూ, దేవత మూర్తులకు పిండి వంటలలో మొదటి రోజు ఒబ్బట్లు, రెండవ రోజు చక్కెర పొంగలి, మూడవ రోజు పులిహోర, దద్దోజనం, నాల్గవ రోజు పాయసం బజ్జిలు, ఐదవ రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ రోజు కుడుములు, ఆరవ రోజు లడ్డులు, ఏడవ రోజు పప్పు గారెలు, పాయసం, మహర్నవమి రోజు మహాలక్షి పూజ నిర్వహించి బొబ్బట్లు, విజయ దశమి రోజు ఇస్టమైన తీపి వంటలు నైవేద్యం చేసి ప్రతి రోజు ముత్తైదువులను పేరంటాలకు పిలిచి తాంబూలం ఇచ్చి వైభవంగా జరుపుకుంటున్నారు. విజయ దశమి తరువాతి రోజున శ్రావణ నక్షత్రం రోజు బంధువులను, స్నేహితులను పిలిచి వాయనం ఇచ్చి చెక్క దేవత బొమ్మల కొలువులకు ఉద్వాసన పలికి, తరతరాలుగా వస్తున్న వారి ఆచారాలు, సంప్రదాయాలను మరువుకుండా జరుపుకోవడం వీరి ప్రత్యేకత. ఇట్టి చెక్క దేవత బొమ్మలను నూతనంగా వివాహం అయ్యి అత్తారింటికి వెళ్లేటప్పుడు నూతన వదువు చీర ఒడిలో ఉంచి ఆనవాయితీ కొనసాగించమని వధువు తల్లిదండ్రులు చెబుతారు. నేటి తరానికి భక్తి అందిస్తూ పండుగలు జరుపుకోవడం శ్రీ వైష్ణవుల కుటుంబాల ప్రత్యేకత. ఇలాంటి విభిన్నరీతిలో తమిళులు వారి సంప్రదాయం ఇంకను కొనసాగించడానికి తెలంగాణ ప్రజల ఆదరణ, ఆప్యాయతలే ప్రధాన కారణం.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్