శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించారు. శనివారం శరన్నవరాత్రుల్లో భాగంగా ఆర్కే7 గని వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అన్నదాన కార్యక్రమంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉద్యోగులు, అధికారుల కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ మైసమ్మ ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గని మేనేజర్ సాయి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే 7,7ఎ గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్ లు , గని సంక్షేమాధికారి సంతన్, అధికారులు, పలు కార్మిక సంఘాల నాయకులు, పిట్ సెక్రటరీలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Daily Archives