ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం అభివృద్ధికి సహకరిస్తామని ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ కే అమర్ నాథ్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, అండర్ మేనేజర్లు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, రెడ్డి కులస్తుల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలని, సంక్షేమ సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహాయ, సహకారం అందించేలా చూడాలన్నారు. ఆపదలో ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్య అతిధులు ఆవిష్కరించారు. సంక్షేమ సంఘం పక్షాన అతిథులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దూదిపాల విజయపాల్ రెడ్డి, నస్పూర్ ప్రధాన కార్యదర్శి మోతె రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు పింగిలి రాంరెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, కార్యదర్శులు పుప్పిరెడ్డి బాపిరెడ్డి, మోరపల్లి రామచంద్రా రెడ్డి, మోరపల్లి అశోక్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పాకాల మహిపాల్ రెడ్డి, చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి, అన్ రెడ్డి సమ్మిరెడ్డి, పోరెడ్డి లక్ష్మారెడ్డి, ఎం. శ్రీధర్ రెడ్డి, రాం రెడ్డి, కె. రాజశేఖర్ రెడ్డి, ముఖ్య సలహాదారులు అర్జుల వేణుగోపాల్ రెడ్డి, సూరం మోహన్ రెడ్డి, భీమ్ రెడ్డి రవీందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
31 January 2024
– ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకై కృషి చేస్తూ, విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో “ప్రతి నెల అభినందన ” పేరుతో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనవరి నెలలో ఇద్దరు ఉపాధ్యాయులు తరగటూరి పావని, బాదావత్ బిక్కులను “ఉత్తమ సేవా ప్రతిభా ప్రశంసా పత్రం” జ్ఞాపిక, శాలువా, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ సమాజానికి వెన్నెముక లాంటి ఉపాధ్యాయుని సత్కరించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందన్నారు. పారుపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతితో పాటు అన్ని తరగతులలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం, జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్, బి.నరసింగ్, ఏ .సతీష్ కుమార్, పి.వాణి శ్రీ, విలాస్ జాదవ్, కె.సంతోష్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్.ధనంజయ, జె. కొమురయ్యలను గని ఎస్ఓఎం ఇ. స్వామిరాజు బుధవారం ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే-న్యూటెక్ గని ఎస్ఓఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సంక్షేమాధికారి పాల్ సృజన్, ఫిట్ ఇంజనీర్ రాజగోపాల చారి, ఇంజనీర్ కృష్ణ, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్లు మిట్లపల్లి శ్రీనివాస్, సాత్విక్, పరమేశ్వర్, ఏఐటీయూసీ నాయకులు సంపత్, గజ్జి రమేష్, మల్లేష్, జంపయ్య, సంపత్ రావు, సకినాల నర్సయ్య, అక్రం పాషా, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.