ఆర్.కె న్యూస్, మంచిర్యాల: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ సంఘం సభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి అసోసియేషన్ తరుపున శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ సమాజం బాగు కొరకు, వివిధ మానసిక సమస్యలు తొలగించడానికి, యువత, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి సైకాలజిస్టులు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారుడు గుండేటి యోగేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి చెరుకు శశి కిరణ్, సిహెచ్ దేవాన్షి, కార్యవర్గ సభ్యులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
12 February 2024
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ప్రభుత్వ ఆర్.బి.ఎస్.కె ఆధ్వర్యంలో సోమవారం కోటపల్లి మండలంలోని పారుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు కోటపల్లి మండల ఆర్.బి.ఎస్.కె వైద్యులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా జ్ఞాపకశక్తి పెంచుకొని ఉత్తమ విద్యను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు టి.పావని, బధావత్ బిక్కు, బి నర్సింగ్, పి. వాణిశ్రీ, సంతోష్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయంలో సోమవారం శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు భక్తి, శ్రద్దలతో నిర్వహించారు. శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఆలయ పూజారి ఆనంద్ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య ఆలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు. శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, హనుమకొండ వారి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుసుమ శంకర్, పద్మశాలి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, ముఖ్య సలహాదారులు చిలువేరు శరవందం, రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం తదితరులు పాల్గొన్నారు.