ఆర్.కె న్యూస్, చెన్నూరు రూరల్: చెన్నూరు మండలంలోని అస్నాద్ గ్రామంలో తాటి చెట్లు చనిపోతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. తాటి చెట్లను నమ్ముకుని జీవనం సాగించే గౌడన్నలకు తాటి చెట్లు ఎలా చనిపోతున్నాయో, ఎందుకు చనిపోతున్నాయో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. చెట్లు చనిపోయేసరికి ఏం పని చేయాలో తోచక కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా చెట్లు చనిపోవడంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టి, తమను ఆదుకోవాలని గౌడన్నలు వేడుకుంటున్నారు.
Daily Archives