ఆర్.కె న్యూస్, రామకృష్ణాపూర్: మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో కొలువుదీరిన శ్రీ కనక దుర్గాదేవి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి ఘనంగా పూజలు ప్రారంభించారు. సోమవారం పూర్ణాహుతి, కుంభ హోమం, చండీ యాగం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ (రక్షణ) కేహెచ్ఎన్ గుప్తా దంపతులు, ఎస్వోటు జీఎం రాజేశ్వర రెడ్డి దంపతులు, రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి రామ్మోహన్ దంపతులు, అధికారులు, కార్మిక కుటుబసభ్యులు, యూనియన్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
4 March 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, సింగపూర్ మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి కొమురయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం శ్రీరాంపూర్ లోని స్మారక స్థూపం వద్ద సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తాళ్లపల్లి కొమురయ్య చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి తాళ్లపల్లి కొమురయ్య అందించిన సేవలను కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల నాయకునిగా, యువజన, విద్యార్థి రంగాలకు నాయకత్వం వహించి, సింగపూర్ ఉప సర్పంచ్ గా సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ముస్కె సమ్మయ్య, ఎస్.కె బాజి సైదా, లింగం రవి, కారుకూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
- పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కాపులకు టికెట్లు ఇవ్వాలి
- కార్పొరేషన్ తోనే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణాలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణాలో బీసీ జనాభాలో 26 శాతం మున్నూరు కాపులున్నారని, 60 లక్షల మున్నూరు కాపులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్ కొకాపేటలో మున్నూరు కాపు భవనానికి స్థలం కేటాయించారని, కానీ కేవలం 5 కోట్లు మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల సరిపోవడం లేదన్నారు. వెంటనే 20 కోట్లు కేటాయించాలన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో కాపు భవనాలకు 2 ఎకరాల స్థలం, 3 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు మ్యానిఫెస్టోలో పెట్టాలని కోరారు. ప్రతి జిల్లాలో మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టల్లు నిర్మించాలన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహం కల్పించడానికి నిరుద్యోగ యువకులకు రుణాలు అందించి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాలీగా ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మున్నూరు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజీవ్, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి, రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, యూత్ జిల్లా అధ్యక్షుడు సీపతి సురేష్, నాయకులు గొంగల్ల శంకర్, సతీష్, తిరుపతి, ఆరె శ్రీనివాస్, ఆకుల బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.