ఆర్.కె న్యూస్, మంచిర్యాల బ్యూరో: మంచిర్యాల పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో చిన్నారులు నిర్వహించిన అకడమిక్ ఫెయిర్ అలరించింది. బుధవారం మధ్యాహ్నం స్కూల్ లో చిన్నారులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రాజెక్ట్ లు, వారి వివరాలు పేరెంట్స్, టీచర్, ముఖ్య అతిథులను అలరించింది. అనంతరం ఏజీఎం చైతన్య రావు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సల్ల మహేష్ లు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం గొప్ప విషయమని తెలిపారు. చదువుతో పాటు క్రమశిక్షణ పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. చిన్నారులకు చదువు, సైన్స్ పట్ల అవగాహన కల్పించడం నారాయణ స్కూల్స్ కే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మాడిశెట్టి కవిత, హై స్కూల్ డీన్ వెంకటస్వామి, ఏ ఓ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి, ఈ కిడ్స్ ఆర్ ఎన్ డీ సంగీత, కో ఆర్డినేటర్ రవళి ప్రియా, కుమార్, ఇమ్రాన్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
6 March 2024
ఆర్.కె న్యూస్, మంచిర్యాల బ్యూరో: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ పూర్వ విద్యార్థులు, ఆర్మీ వింగ్ ఎన్.సి.సి క్యాడెట్లు ఏదునూరి వంశీ, నల్ల నాగేంద్ర ప్రసాద్ పరీక్ష ప్యాడ్, కంపాస్ బాక్స్, పెన్నులు ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ గురుశిష్యుల బంధం ఎంతో చిరస్మరణీయమైనదని, పూర్వ విద్యార్థులు గురుభక్తిని చాటడం ఎంతో అభినందనీయమని, వంశీ, నాగేంద్ర ప్రసాద్ లు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా పరీక్షలు రాసి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులను పాఠశాల మెమెంటో, పుష్ప గుచ్చాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్లు, టి. పావని, బి.నర్సింగ్, ఏ. సతీష్ కుమార్, పి.వాణిశ్రీ, విలాస్ జాదవ్, కె.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలోని ప్రశాంత్ నగర్ లో బుధవారం నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృషి ఫలితంగా నస్పూర్ మున్సిపాలిటీకి నాలుగు కోట్ల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధరణీ మధుకర్, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.