- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మునిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ 20వ వార్డు సీతారాంపల్లిలో 73 కోట్ల రూపాయలతో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్స్, ట్యాంక్ నిర్మాణం, 4.03 కోట్ల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులతో సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో ట్యాంకర్ల అవసరం లేకుండా మంచి నీటి సరఫరా చేస్తామన్నారు. నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట్ల రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు బండి పద్మ, మడిగ మల్లయ్య, చిడం మహేష్, బండారి సంధ్యారాణి, సుమతి, బొద్దున సంధ్యారాణి, తెనుగు లావణ్య, కోడూరి లహరి, రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, ఆర్.ఓ కే. సతీష్, డిప్యూటీ ఈఈ పిహెచ్ శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మధు, ఏఈ పి.ఆర్ సుబ్బారావు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.