క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని సిఇఆర్ క్లబ్ లో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధా కుమారి ముఖ్య అతిథులుగా హాజరై కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగితే నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. మానవ శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలని, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో ఏరియా వైద్య అధికారులు వైద్య సిబ్బంది ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, ఈ మేరకు క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల పై అవగాహన, వ్యాధి నిర్ధారణ పరీక్షల సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటే సంస్థ అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగులందరూ తమ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అవసరమైన మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ఏసీఎంఓ డాక్టర్ ఉష, జనరల్ సర్జన్ డాక్టర్ వి శ్రీకాంత్, గైనకాలజిస్ట్ డాక్టర్ జి హరిత, డాక్టర్ లోకనాథ్ రెడ్డిలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ వ్యాధుల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, ఎస్వోటు జీఎం వి పురుషోత్తమ రెడ్డి, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డిప్యూటీ సిఎంఓ డాక్టర్ రమేష్ బాబు, బెల్లంపల్లి డిప్యూటీ సిఎంఓ డాక్టర్ శౌరి, డాక్టర్ మురళీధర్, సీనియర్ పిఓ పి కాంతారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.