- అలరించిన చిన్నారుల ఆట పాట
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని నారాయణ స్కూల్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అలరించాయి. శుక్రవారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. చిన్నారులు ప్రత్యేక దుస్తులు (రోబ్స్) ధరించడంతో అందరినీ ఆకట్టుకున్నారు. అతిథులు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, పాఠశాల ఏజీఎం అనం చైతన్య రావు, ప్రిన్సిపాల్ మామిడిశెట్టి కవితలకు చిన్నారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపాల్ అమల స్కూల్ ప్రగతి నివేదిక అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గొప్ప పేరు ప్రఖ్యాతులు, 45 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలో చదవడం గర్వంగా భావించాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ డి సంగీత రావు, రవళి, ఎఓ సంతోష్ కుమార్, స్రవంతి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.