ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అలరించాయి. గురువారం ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నర్సరీ, ఎల్.కె.జి, యు.కె.జి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు నస్పూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నస్పూర్ ఎమ్మార్వో మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. రామక్రిష్ణా రెడ్డి, కరస్పాండెంట్ రెగళ్ళ ఉపేందర్, డైరెక్టర్ విష్ణు, రాజేందర్, ఇన్చార్జి స్వదీప్తి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
25 April 2024
🔹 మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్
🔹 హుషారుగా గ్రాడ్యుయేషన్ డే
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారి లక్ష్యాలను చేరుకునేలా చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్ తెలిపారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా వారికి సలహాలు సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అంతే కాకుండా చదువుకునే వయస్సులోనే పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, వారు ఎటువంటి చెడు అలవాట్లకు గురికాకుండా చూడటం తప్పని సరి అని తెలిపారు. ఏజీఎం ఆనం చైతన్య రావు, స్కూల్ ప్రిన్సిపాల్ మామిడిశెట్టి కవితలు మాట్లాడుతూ, గొప్ప పేరు ప్రఖ్యాతలు, 45 యేండ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో చదవడం గర్వంగా భావించాలని, విద్యారంగంలో నూతన విధానంతో సంచలన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ అమల స్కూల్ ప్రగతి నివేదిక అందించారు. అనంతరం చిన్నారులకు మెడల్స్ అందించి అభినంధించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కో ఆర్డినేటర్ శ్రావణి, హైస్కూల్ డీన్ వెంకటస్వామి, ఏఓ సంతోష్ కుమార్, రాజేందర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.