ఆర్.కె న్యూస్, నస్పూర్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకులు, ఎటిఎంలలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిసిసి నస్పూర్ ఎస్సై ఎన్. సుగుణాకర్ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద అమాయకుల నుండి డబ్బు దొంగతనాలు, ఎటిఎంల వద్ద మోసాలు, ఇతర నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసినట్లు తెలిపారు. బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో వాడే అలారం సిస్టం పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. బ్యాంకులో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే బ్యాంకు సిబ్బంది వెంటనే డయల్ 100కు కానీ, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో సిసిసి నస్పూర్ బ్లూ కోల్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Daily Archives