ఆర్.కె న్యూస్, రామకృష్ణాపూర్: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రాజీవ్ చౌక్ నుండి ప్రారంభమై అశోక్ నగర్ సూపర్ బజార్, రామాలయం, ఏ జూన్, గంగా కాలనీ మీదుగా తిరిగి రాజీవ్ చౌక్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వనం సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండాలని అలాగే, ఆప్కో వంటి కార్పొరేషన్లు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని, పద్మశాలి కార్పొరేషన్‌కు 2000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆత్మహత్యలను నివారించాలని, రద్దు చేసిన పాత స్కీములను పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని సత్యనారాయణ అన్నారు. ఇన్సూరెన్స్, సబ్సిడీ అందించాలని, కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాదీ వస్త్రాలను హాస్టళ్లలో, పాఠశాలల్లో డ్రెస్ కోడ్‌గా అమలు చేయాలని, తద్వారా చేనేత కార్మికులకు పని అవకాశం కల్పించాలన్నారు. పట్టణంలో సంఘ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న రోజుల్లో చేనేత రంగాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు పద్మశాలి బంధువులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, ఉపాధ్యక్షులు ఆడెపు కృష్ణ కుమార్, స్టీరింగ్ కమిటీ నాయకులు ఆడెపు లక్ష్మణ్, బొద్దుల మల్లేష్, సాంబార్ వెంకటస్వామి, సహాయ కార్యదర్శి వేముల అశోక్, బండారి రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండకుమారు పినుమల్ల శివప్రసాద్, మెరుగు రమేష్, మీడియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పినుమల్ల గట్టయ్య, మెరుగు శంకర్, గాజంగి సంతోష్, నులికొండ సత్యం, చిదురాల రాజేందర్, హరి ప్రసాద్, సామల శ్రీనివాస్, రాజు గణేష్, ఉరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
7 August 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఎంతో నైపుణ్యంతో కూడిన వృత్తి చేనేత రంగమని, ప్రస్తుత కాలంలో సరైన ఆదాయం లేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గాదేవి ఆలయ ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కుసుమ శంకర్, సట్కూరి రవీందర్, కుంట రామన్న, మెండె వెంకటి, క్యాతం రాజేష్, కన్నం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.