ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రావు ను మంగళవారం గని పిట్ కార్యదర్శి కాంపెల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛము అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఎం.కె.ఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, సెంట్రల్ సెక్రెటరీ రాగం రాజేందర్, ఏరియా జాయింట్ సెక్రటరీ భోంపల్లి రమేష్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేష్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
20 August 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు బేటి బచావో బేటి పడావో పథకం, బాలికలు, మహిళల సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం నస్పూర్ పట్టణంలోని ఎయిమ్స్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ విజయ, ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు లిప్సికలు పాల్గొని మాట్లాడుతూ, బేటి బచావో బేటి పడావో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విదివిధానాలు విద్యార్థులకు వివరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టం, లింగ సమానత్వం, బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, సుకన్య సమృద్ధి యోజన, మిషన్ వాత్సల్య, ఆడపిల్లల ప్రాముఖ్యత, మహిళా సాధికారత, పోక్సో యాక్ట్, డిజిటల్ ఎడ్యుకేషన్, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 1930, సఖి సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ 100, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14567, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, హెల్ప్ లైన్ నెంబర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మైదం రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మందమర్రి: మందమర్రి ఏరియా నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన జి. దేవేందర్ ను ఏరియా డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ క్రీడాకారులు, కళాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంను శాలువాతో సన్మానించి మొక్కను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త రవికుమార్, జనరల్ కెప్టెన్ టి. చిన్నయ్య, క్రీడల కెప్టెన్లు ,సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారినిలు,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మంగళవారం నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సిసిసి కార్నర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 40 ఏళ్ళ వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన హయాంలోనే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం విప్లవానికి పునాదులు పడ్డాయని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం పాటుపడుతూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.