-
శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం శ్రీనివాస్
ఆర్.కె న్యూస్, నస్పూర్: సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో ఇన్చార్జి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, గత నెల సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత సమీక్షించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత సాధించడానికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. గనులలో యంత్రాల వినియోగం 100 శాతం ఉండడానికి ప్రయత్నించాలని, ఉపరితల గనుల్లో ఓబి కాంట్రాక్ట్ కంపెనీలు నిర్దేశిత రోజువారి లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఎస్సార్పీ 1,3 గ్రూప్ ఏజెంట్ గోపాల్ సింగ్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఆర్.కె గ్రూప్ ఏజెంట్ రాముడు, ఆర్.కె 5, 6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు పి అరవింద రావు, చిరంజీవులు, ఆనంద్ కుమార్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, క్వాలిటీ మేనేజర్ కె వెంకటేశ్వర రెడ్డి, అన్ని గనుల మేనేజర్లు, రక్షణాధికారులు, అన్ని గ్రూప్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.