ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి యాజమాన్యం జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు పరీక్ష నిర్వహించకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారని, పరీక్ష తేదీని తెలియజేసి పరీక్ష వెంటనే నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గుండ్ల బాలాజీ, అంబాల శ్రీనివాస్ లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వెంటనే నిర్వహించి సిబ్బంది కొరత తగ్గించాలని అన్నారు. ఆఫీసు సిబ్బంది పాత కుర్చీలలో కూర్చొని నడుము, మెడ నొప్పులు వస్తున్నందున కొత్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలని, పాతకాలపు ప్రింటర్ల స్థానంలో కొత్త డిజిటల్ స్కానర్ కం ప్రింటర్లను ప్రతి సెక్షన్ లో ఏర్పాటు చేసి సీఎం పిఎఫ్ చిట్టిలను సకాలంలో ఇప్పించేలా చూడాలని, ప్రతి ఆఫీసులో క్యాబిన్లు ఏర్పాటు చేయాలని, ఆఫీసుల నిర్వహణ నిమిత్తం ఉన్న డెలిగేషన్ పవర్ ను కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని అన్నారు.
15 September 2024
- సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు లింగం రవి
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఆదివారం నస్పూర్ పట్టణ, తాళ్లపల్లి గ్రామ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి నస్పూర్ లో, పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు షిర్కే సెంటర్ లో, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తాళ్లపల్లిలో శాఖలో జెండా ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారని, రావి నారాయణరెడ్డి సారధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గెరిల్లా రక్షక దళాలుగా ఏర్పడి 10 లక్షల ఎకరాల భూమిని పంచినట్లు, మూడువేల గ్రామాలను విముక్తి చేసినట్లు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని, బిజెపి ప్రభుత్వం మాత్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తుంది, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, మోత్కూరు కొమురయ్య, చిలుక రామచందర్, సంఘం సదానందం, కోడి వెంకటేష్, మండల నాయకులు గుడెల్లి రాజయ్య, దాడి రాజయ్య, శాఖపురం భీమరాజు, మర్రి సందీప్ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, తోట మహేష్, ముగురం రాకేష్, ఉయ్యాల శంకర్, బాలసాని లక్ష్మణ్, కంచెం పోశం, ఎండి రషీద్, గద్దె నరసయ్య, నాగపురి సమ్మయ్య, దాసరి రాజేష్, జోగుల ఆంజనేయులు, కొప్పుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ అన్నారు. ఆదివారం ఆర్.కె 6 హనుమాన్ నగర్ లోని బాల గణేష్ మండపంలో వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మండపం నిర్వాహకులు ఎస్ఐ సంతోష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగిడి రాజేష్, క్యాతం సతీష్, రమేష్, భీమయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.