ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ సాధన సమితి, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ సాధన సమితి, పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర తొలి, మలిదశ ఉద్యమకారుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వరాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, మంచిర్యాల జిల్లాకు పేరును కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, పాఠ్య పుస్తకాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను పొందుపరచలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గాదాసు బాపు, గడ్డం సుధాకర్, రామ్ సత్తయ్య, బండి మల్లికార్జున్, నల్ల నాగేంద్ర ప్రసాద్, వేముల రమేష్, అంకం వాసు, బొట్ల సత్యం, అయిడపు రాజబాపు, కుందారపు రమేష్, రుద్రా నారాయణ, ఆడేపు కుమారస్వామి, చిలగాని సుదర్శన్, చెలిమల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Daily Archives
21 September 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుమారుడు చరణ్ రావు, కోడలు శైలేఖ్యతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు ను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.