- గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్ వైఫల్యం కారణంగా తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగతనాలు పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా అన్నారు. ఆర్.కె 5 గనిలో శనివారం నైట్ షిఫ్ట్ లో దొంగతనం విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఆదివారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్ లోని ఉన్నతాధికారులు లాంగ్ స్టాండింగ్ గా విధులు నిర్వహించడం, దొంగతనాలు జరిగిన తర్వాత కేసు నమోదు అయిన తర్వాత వారితో సయోధ్య కుదుర్చుకోవడం వల్ల వాళ్లు తిరిగి దొంగతనాలు చేస్తున్నారని, గతంలో కూడా ఆర్.కె 5 గనిలో మూడు సార్లు దొంగతనాలు జరిగాయని, సీసీ కెమెరాలు పెట్టాలని, సరిపడా సెక్యూరిటీ గార్డులను నియమించాలని పలు మార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన యాజమాన్యం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో లేదని, కార్మికులకు కబోర్డ్స్ నిర్మించాలని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు పరిష్కారం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు నాగుల రాజయ్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.