ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సెంట్రల్ నర్సరీలో ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆట పాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) రవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దసరా వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆట పాట కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఇన్చార్జి డిజిఎం (పర్సనల్) రాజేశ్వర్ , పర్చేస్ శ్రీ చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
8 October 2024
- గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. సీతారామయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని అన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్.కె 5 గని పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను అయోమయానికి గురి చేయడానికి, కార్మికుల్లో వారి మనుగడ కొరకు, కార్మికుల్లో ఏఐటియుసికి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే లాభాల వాటా పై తప్పుడు ప్రచారాలు చేశాయని అన్నారు. తాము గత 20 సంవత్సరాల నుండి కంపెనీకి వచ్చిన స్థూల లాభం, కంపెనీ అభివృద్ధి కొరకు ఉపయోగించే మొత్తాన్ని మినహాయించి నికర లాభాల మొత్తం నుండి కార్మికులకు పంచిన లాభాల వాటా శాతాన్ని తాము అన్ని గనులలో కార్మికులు అర్థమయ్యే విధంగా గోడ ప్రతులు వేసామని అన్నారు. కార్మికులను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నించిన కార్మిక సంఘాలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘంగా గుర్తింపు పత్రం 8 నెలలు ఆలస్యమైనప్పటికీ తాము కార్మికుల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడానికి కృషి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ్ రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఎస్ అండ్ పిసి పిట్ కార్యదర్శి ఆడేపు మల్లికార్జున్, పిట్ సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మాడగొని మల్లేష్, శ్రీకాంత్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి
- ఆర్.కె న్యూటెక్ గని పై హోమం, అన్నదానం
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా వారి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి అన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిలోని మైసమ్మ ఆలయంలో మంగళవారం హోమం నిర్వహించారు. ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి-రాధా కుమారి దంపతులు, గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు-లీలావతి దంపతులు, గని ఎస్ ఓ ఎం ఇ. స్వామి రాజు-రమాదేవి దంపతులు, రక్షణాధికారి కొట్టె రమేష్-అరుణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ పని స్థలాల్లో ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని తెలిపారు. ఉద్యోగులందరూ సమిష్టి కృషితో గనిని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పేర్కొన్నారు. అనంతరం గని ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేయగా ఉద్యోగులు, కార్మిక కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య , ఏరియా కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, కొట్టె కిషన్ రావు,హెచ్.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గనిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఏజెంట్లు గోపాల్ సింగ్, శ్రీధర్, అధికారులు ఏవీ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్, మురళీధర్ రావు, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, అన్ని గనుల మేనేజర్లు, విభాగాల అధికారులు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎ.సంపత్, గజ్జి రమేష్, సందీప్ కుమార్, తిరుపతిరెడ్డి, మల్లేష్, ఆలయ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.