- శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి తన విధి నిర్వహణలో సింగరేణి సంస్థ పురోభివృద్దికి అందించిన సేవలు వెలకట్టలేనివని శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ అన్నారు. సింగరేణి సంస్థలో పూర్తి సర్వీస్ కాలం పనిచేసి పదవీ విరమణ పొందుతున్న శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, సివిల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ రెడ్డి లను ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియా అభివృద్ధిలో బి. సంజీవ రెడ్డి తన దైన ముద్ర వేశారని, తన అనుభవంతో శ్రీరాంపూర్ ఏరియాను ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంచారని అన్నారు. సివిల్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న రవీందర్ రెడ్డి సింగరేణి సంస్థకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు టి. శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏజెంట్లు శ్రీధర్, డీజీఎంలు పి. అరవింద రావు, చిరంజీవులు, ఆనంద్ కుమార్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, ఏరియా సర్వే అధికారి వెంకటేశం, డీజీఎం (లా) శిరీష రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రమణి, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, జీఎం కార్యాలయ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.