ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తూ, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన దుర్గం సారమ్మను ఘనంగా సన్మానించారు. మంగళవారం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా సింగరేణి అధికారులు, తోటి ఉద్యోగులు దుర్గం సారమ్మను ఘనంగా సన్మానించారు. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో తాను కుంగిపోకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే తపనతో వారిని ఉన్నత చదువులు చదివించి, మంచి భవిష్యత్ అందించారు. సారమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మొదటి కుమార్తెకు చిన్నతనంలోనే వివాహం చేశారు. రెండో కుమార్తె విజయ మంచిర్యాల కలెక్టరేట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంది, మొదటి కుమారుడు కృష్ణ సీసీసీలోని ఆంధ్రా బ్యాంక్ లో అకౌంటెంట్ గా,రెండో కుమారుడు మహేందర్ కాగజ్ నగర్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు, మూడవ కుమార్తె గృహిణి. భర్త లేకపోయినా కృంగిపోకుండా పిల్లల కోసం ఎంత కష్టమైన భరించి వారిని ఉన్నత స్థానంలో నిలిపిన సారమ్మను పలువురు అభినందించారు. 1992లో ఉద్యోగంలో చేరి అప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉద్యోగం చేయడం గొప్ప విషయమని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
31 December 2024
- గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య
ఆర్ . కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు అభినందనీయం గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వీరభద్రయ్య మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, జిఎం కమిటీ మెంబర్ చంద్రశేఖర్, మైనింగ్ స్టాప్ ఏరియా నాయకుడు రాజేందర్, బ్రాంచ్ మీడియా ప్రతినిధి రాజ్ కుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, అనిల్, యాదగిరి,చిలక రమేష్, అఖిల్, శంకర్, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.