ఆర్ కె న్యూస్ , నస్పూర్: భారతీయ జనతా పార్టీ నస్పూర్ పట్టణ అధ్యక్షులుగా సత్రం రమేష్ ను జిల్లా సంస్థ గత ఎన్నికల ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం భాజపా జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు సంస్థ గత ఎన్నికల ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి లకు కృతజ్ఞతలు తెలిపారు. నస్పూర్ పట్టణంలో పార్టీ బలోపేతానికి తనవంతు చేస్తానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్, దుర్గం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
9 January 2025
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి సైకాలజిస్టుల పాత్ర ఎంతో విలువైనదని, సమాజంలోని మానసిక రుగ్మతలు తొలగించడానికి, విద్యార్థులలో మానసిక సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జీవన నైపుణ్యాలను పెంచడానికి, పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి, యువత గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు సైకాలజిస్టుల సేవలు అవసరమని తెలిపారు. అనంతరం తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్, సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ తమ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సుమన చైతన్య, వైస్ ప్రెసిడెంట్ బి. రజిత, గౌరవ సలహాదారు గుండేటి యోగేశ్వర్, సైకాలజిస్టులు సృజన మోహన్, తాళ్లపల్లి కవిత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.