నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపుర్ ఏరియా జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమితులైన ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం సింగరేణి ప్రధాన కార్యాలలయంలోని డైరక్టర్ (ఆపరేషన్స్) ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
23 February 2025
- డి.ఎస్.పి ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 27న జరుగనున్న ఉమ్మడి మెదక్, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేఖరులతో మాట్లాడుతూ, పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల ఆశయ సాధనకు ధర్మ సమాజ్ పార్టీ పని చేస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు, సంపదను కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారని, ఓటర్లను డబ్బులు, మాయమాటలతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం సహకారం అందించడం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు జంగపెల్లి రామస్వామి, రేగుంట రాకేష్, ఏదునూరి రమేష్, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల 1999-2000 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 25 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు జక్కుల మల్లేష్, తొట్ల బుచ్చన్న, కారుకూరి రవీందర్, శ్రీనివాస్ శర్మ, నగేష్, నరేష్, గణేష్, ధనలక్ష్మి, రమాదేవి, రేఖ ఠాగూర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.