- విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలి
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షలు రాసిన 62 మంది విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల దశ నుంచే ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల దశ నుండి ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఉన్నత చదువులకు తొలిమెట్టు పాఠశాల అని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడంలో ముందుండాలని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాల అధిరోహించడానికి ముందస్తు ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా చదవాలని, పదో తరగతి తర్వాత ఏ కోర్సులో చేరాలనేది కెరీర్ గైడెన్స్ ద్వారా తెలుస్తుందని, నిష్ణాతుల సలహాల మేరకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, పాఠశాల కరస్పాండెంట్ ఏ. రాజేశ్వర్, పాఠశాల హెడ్మాస్టర్ బి. సంతోష్, రిటైర్డ్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ చంద్ర ప్రకాష్ రెడ్డి , జెసిఐ నేషనల్ ట్రైనర్ సిహెచ్. ప్రవీణ్ కుమార్, బి. శంతన్, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు డి. సమ్మయ్య, కే. వాణి శ్రీ, రాజా రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.