నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిపై మంగళవారం ఏరియా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఎక్కువ మోతాదులో నీరు, తాజా పండ్ల రసాలు తీసుకోవాలని అన్నారు. మూత్రపిండాలు సురక్షితంగా ఉండాలంటే ప్రతిరోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తీసుకోవాలని, ఊబకాయులు, రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తులు 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. తదుపరి గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ, ఉద్యోగులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని, ఆకుకూరలు, పండ్లు ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, రక్షణ అధికారి సంతోష్ రావు, ఫిట్ సెక్రటరీ మారపల్లి సారయ్య, ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, రాము, లక్ష్మీ, సుమ, సంక్షేమ అధికారి సంతన్ తదితరులు పాల్గొన్నారు.
Daily Archives