బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్మిక సంఘానికి ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా రాసకొండ శ్రీనివాస్ ను బెల్లంపల్లి మున్సిపల్ కమిటీ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మండల ఇంచార్జ్ జిలకర శంకర్ మాదిగ, ఉపాధ్యక్షులు రమేష్, రాజేశ్వరి, అధికార ప్రతినిధి తోటపల్లి ప్రతాప్, కార్యదర్శి మధునయ్య, సెక్రటరీ శేఖర్, కోశాధికారి రాములు ఈ నూతన కమిటీనీ శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు చిన్న రాజం, మచ్చ రాజేష్, నాతర శివ ప్రధాన కార్యదర్శి, రత్నం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
9 April 2025
- బెల్లంపల్లిలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు బుధవారం రోజున బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘర్బంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి, టౌన్ సెక్రెటరీ ఆడెపు రాజమౌళి లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై రూ,,50లు, పెట్రోలుపై రూ|| 2, డీజిల్ రూ|| 2 పెంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుందన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడి దారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకొస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచుతూ వేల కోట్లు రూపాయలను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సీపీఐ ఆద్వర్యంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ అనుబంధ సంఘాల నాయకులు బొల్లంపూర్ణిమ, గుండా సరోజన, గుండా చంద్ర మాణిక్యం, కొంకుల రాజేష్, రత్నం రాజం తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 6 గని స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గని ఆవరణలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ఆర్.కె 6 గని బొగ్గు ఉత్పత్తిలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుందని అన్నారు. ఆర్.కె 6 గానికి ఎస్.డి.ఎల్ ట్రోఫీ రావడానికి షి చేసిన ఉద్యోగులు, అధికారులు, సూపర్ వైజర్స్ లను అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సన్మానించి, మెమోంటో, స్వీట్ బాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, గని మేనేజర్ ఇ. తిరుపతి, సేఫ్టీ ఆఫీసర్ కాదని శ్రీనివాస్, ఫిట్ ఇంజనీర్ ఎ.శ్యామ్ కుమార్, వెంటిలేషన్ ఆఫీసర్ రాం నర్సయ్య, అడిషనల్ మేనేజర్ ఎం.కొమురయ్య, సంక్షేమాధికారి ఎస్.సురేందర్, గుర్తింపు సంఘం నాయకులు ముష్కే సమ్మయ్య, వీర భద్రయ్య, సంగం సదానందం, ఇతర యూనియన్ నాయకులు, ఉద్యోగులు, అధికారులు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.