మంచిర్యాల, ఆర్.కె న్యూస్: స్థానిక నారాయణ హై స్కూల్ లో బుధవారం ప్రీ మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏజీఎం చైతన్య రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏజీఎం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి తల్లి మొదటి గురువు అని అన్నారు. విద్యార్థులకు తల్లి గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లక్ష్యమని అన్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ, నారాయణ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలతో విద్యార్థులను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నారని అభినందించారు. ప్రీ మదర్స్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పలు పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రేష్మ, స్రవంతి, ఏవో సంజీవ్, పీఈటి కుమార్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Daily Archives