నస్పూర్, ఆర్.కె న్యూస్: కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి, వేడి నుండి ఉపశమనం పొందడానికి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని సంవత్సరాలుగా గెలుపు ఓటములు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, నాయకులు దర్ని మధు, కుమార్, సంపత్ రెడ్డి, అజయ్ గౌడ్, తిరుపతి, బండి పద్మ, నక్క రాజేశ్వరి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Daily Archives
27 April 2025
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని చాణక్య హై స్కూల్ 1998-1999 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 26 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న గౌడ్, ఉపాధ్యాయులు రాజేందర్, వెంకటరెడ్డి, సుధాకర్, వెంకట్ రాజం, సీతారాం, కిరణ్, సంపత్ కుమార్ సుజాత, రాజేశ్వరి, లింగమూర్తి, గంగారాం, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాకేష్, వేణు, మధు, శ్రీనివాస్, కరుణాకర్ రాజు, రాజి రెడ్డి, సుధాకర్, కిషన్, శివకుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.