నస్పూర్, ఆర్.కె న్యూస్: సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ గా యు. ఉపేందర్ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టాస్క్ ఫోర్స్ ఎస్సైగా పనిచేస్తున్న ఉపేందర్ రావు సిసిసి నస్పూర్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు బాధ్యతాయుతంగా కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
4 May 2025
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో నస్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్, మెడ్ లైఫ్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో నస్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మనాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇన్ ఫెర్టిలిటీ, చైల్డ్ కేర్, జనరల్, లాప్రోస్కోపీ సర్జరీ, యూరాలజీ వంటి అనేక సంబంధిత వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. మనలో ఉన్న సమస్య సాధారణంగా తెలియదని, పరీక్షలు నిర్వహించినప్పుడు బయటపడుతుందని, ఇలాంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. రెనె ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి, నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1200 మంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం సత్యనారాయణ ఈసీజీ, టూడీ ఏకో సేవలను ప్రారంభించారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల ఆశోక్ శిబిరాన్ని సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తాము చేపట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన రెనె సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమాన్యానికి, మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రి యజమాన్యానికి, తమకు అన్ని విధాలుగా సహకారం అందించిన శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఇతర సింగరేణి అధికారులు, పోలీస్ అధికారులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, గౌరవ అధ్యక్షుడు భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులు శ్రీపతి రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శి క్యాతం రాజేష్, సంయుక్త కార్యదర్శి ఏల్పుల మల్లేష్, కోశాధికారి కేశిరెడ్డి నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యుడు తలారి సమ్మయ్య, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కోడం రవికుమార్, సభ్యులు బియ్యాల రాజ్ కుమార్, దాసరి నరేందర్, కుమ్మరి సతీష్, నారమల్ల పురుషోత్తం, వైద్య శ్రీనివాస్, ఏబీ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనె ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి, క్యాంపు కోఆర్డినేటర్లు పుల్లూరి సుధాకర్, వసీమోద్దీన్, రెనె ఆసుపత్రి జీఎం బంగారి పవన్ ప్రసాద్, నాన్ సర్జికల్ డైరెక్టర్ మేకల అరవిందరావు, వైద్యులు దినకర్, నిఖిల్ లక్ష్మణ్, రవి కుమార్, జొన్నల శ్రీనివాస్, రాజ్ కిరణ్, కనకరాజు, రామలక్ష్మి, ఫర్హన, శివకుమార్, వైభవ్, మెడిలైఫ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కుమారస్వామి, చేతన్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.