నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ లోని విద్యార్థులకు బుధవారం షీ టీం, భరోసా పై షీ టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ, ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం కర్తవ్యమని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు సహాయం అందుతుందని తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు 6303923700 నెంబర్ లో సంప్రదించాలని, అత్యవసర సమయంలో డయల్ 100 లో సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. సబ్ ఆర్డినేటర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ పని తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రవణ్, జ్యోతి, భరోసా సెంటర్ సభ్యులు, పాఠశాల సోషల్ ఆఫీసర్ మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
14 May 2025
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: కొన్ని కార్మిక సంఘాలు పలు డిమాండ్లతో ఈ నెల 20న తలపెట్టిన ఒక్క రోజు టోకెన్ సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండి, విధులకు హాజరై లక్ష్య సాధనకు సహకరించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ కోరారు. బుధవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, సమ్మె ప్రధాన డిమాండ్లు సింగరేణి పరిధిలో లేనివని, సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె చేస్తే సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియాలో 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సుమారు 13.07 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్మా అమలులో ఉందని, సమ్మెలు నిషేధమని తెలిపారు. వర్షా కాలంలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, లక్ష్య సాధనకు ఒక్క రోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటు అందిస్తుందని, సింగరేణి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి తమ వంతు కృషి చేయాలన్నారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులను ఎవరైనా అడ్డుకుంటే పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎం. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.