- సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
- ఆగస్టు 22, 23వ తేదీల్లో సిపిఐ రాష్ట్ర మహాసభలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక నర్సయ్య భవన్ లో కామ్రేడ్ ఉమా, కామ్రేడ్ చిలుక రామచందర్, కామ్రేడ్ మర్రి సందీప్, కామ్రేడ్ ఎండి అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ నస్పూర్ మండల మూడో మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ తో కలిసి హాజరయ్యారు. షిర్కే సెంటర్ నుండి నర్సయ్య భవన్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకుడు అల్లా లచ్చి రెడ్డి పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు డికొండ మల్లన్న అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితుల్లో పాలన కొనసాగిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విఫలం అయ్యిందని, ఆరు గ్యారెంటీల్లో మూడు గ్యారంటీలు మాత్రమే అమలు చేసిందని, ఇప్పటికైనా మిగతా మూడు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేసి, చర్చలు జరపాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ పోటీ చేస్తుందని, నూతనంగా ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆదరించాలని ప్రజలను కోరారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో మేడ్చల్ లో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ నెలలో పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో జాతీయ మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. సిపిఐ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాల్గొని రాష్ట్ర, జాతీయ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు మేకల దాస్, కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, కే వీరభద్రయ్య, లింగం రవి, ముస్కె సమ్మయ్య, ఎస్కే బాజీ సైదా, రేగుంట చంద్రకళ, మోత్కూరు కొమురయ్య, ఎండి అఫ్రోజ్ ఖాన్, దొడ్డిపట్ల రవీందర్, మొగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.