- సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు అన్నారు. గురువారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా స్థానిక ఆక్స్ ఫోర్డ్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు మాట్లాడుతూ, స్కూల్ బస్సు డ్రైవర్లు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, పాఠశాల వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని, బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను అనుమతించాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.