నస్పూర్, ఆర్. కె న్యూస్: కాలి గాయంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రేమ్ సాగర్ రావు పూర్తిగా కోలుకొని, మళ్లీ జనాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్ర స్వస్థత కలగాలని ఆకాంక్షిస్తూ, పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Daily Archives
8 August 2025
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి మారుపేర్ల బాధితుల విజిలెన్స్ కేసుల సమస్యలకు పరిష్కారం చూపి, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని మారుపేర్ల బాధితులు దబ్బెట అంజయ్య, రాజయ్య, సంకీర్త్ లు తెలిపారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లు సింగరేణి సంస్థలో పని చేసి సంస్థ పురోభివృద్ధికి కృషి చేశామని, తమ వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు రాక ఆర్థికంగా చితికిపోయి, దుర్భర జీవితాలు గడుపుతున్నామని, పలుమార్లు డిప్యూటీ సీఎంతో పటు పలువురు మంత్రులకు, కార్మిక సంఘాల నాయకులకు వినతి పత్రాలు అందజేశామని, జూన్ 27న సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట మారుపేర్ల బాధితులంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: గత ఆర్థిక సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు తక్షణమే ప్రకటించి, కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నాయకులు శుక్రవారం ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, జోర్క వెంకటేష్, పిట్ కార్యదర్శి పెరుక సదానందం, ముచ్చకుర్తి రమేష్ , ప్రతాప్, తెల్లం పుల్లారావు, రాజయ్య, లింగమూర్తి , అభిలాష్, తిరుపతి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
- గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఉపరితల గనిలో పని చేస్తున్న క్లరికల్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి, మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లడుతూ, వే బ్రిడ్జ్, రైల్వే కరస్పాండెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న క్లర్కులకు, అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఇచ్చినట్లు ఇన్సెంటివ్ ఇవ్వాలని, క్లరికల్ సిబ్బంది వాహనాల పార్కింగ్ కోసం ప్రాజెక్ట్ ఆఫీస్ పరిధిలో పార్కింగ్ షెడ్ నిర్మించాలని, అంకితభావంతో పని చేస్తున్న క్లరికల్ ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి, రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలతో సన్మానించాలని, క్లరికల్ సిబ్బంది సౌకర్యవంతంగా పని చేసేందుకు అవసరమైన ఫర్నిచర్, పనికి తగినట్లు కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చాలనే పలు డిమాండ్లపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, ఎస్సార్పీ ఓసిపి క్లరికల్ పిట్ ఇన్చార్జి కట్ల రమేష్, క్లరికల్ సిబ్బంది బానేష్, సునీల్, శివ శంకర్, సంజయ్, జయబాబు, సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.