- ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి
ఆర్ . కె న్యూస్, నస్పూర్: సింగరేణి సెక్యూరిటీ విభాగానికి వాసాల కనకయ్య అందించిన సేవలు మరువలేనివని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ కార్యాలయ ప్రాంగణంలో పదవీ విరమణ పొందిన సెక్యూరిటీ విభాగం జమ్మేదార్ వాసాల కనకయ్యను ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్, పర్మినెంట్, ప్రైవేట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతూ, వృత్తిరీత్యా కనకయ్య క్రమశిక్షణతో విధులు నిర్వహించేవారని, సెక్యూరిటీ విభాగానికి ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. వాసాల కనకయ్య ను ఆదర్శంగా తీసుకొని సెక్యూరిటీ ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదారులు, పర్మినెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.