- తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు నలిమెల మహేష్ వర్మ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు నలిమెల మహేష్ వర్మ అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్బంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకుడు మహేష్ వర్మ మాట్లాడుతూ, సిఆర్ఆర్ కంపెనీ, ఉదయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాంట్రాక్టు కార్మికులకు 4 నెలల జీతాలు ఇవ్వకుండా, విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ను సంప్రదించగా కాంట్రాక్టు కార్మికుల ఇప్పిస్తానని చెప్పి, ఇప్పుడు సంబంధం లేదని మాట మార్చారని మండిపడ్డారు. మోసపూరిత కంపెనీలకు కాంట్రాక్ట్ ఎలా ఇస్తున్నారని, కార్మికుల శ్రమను దోచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టాలని, సదరు కంపెనీల లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, సిపతి సాయి కుమార్, ఎండి లతీఫ్, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.