- చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
- మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి పౌరుడు ఒక పోలీసే అని, సంఘ విద్రోహ శక్తులు, అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ మాట్లాడుతూ, పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్ రావు, వేణు చందర్, నరేష్ కుమార్, సత్యనారాయణ, బన్సీలాల్, ఎస్సైలు యు. ఉపేందర్ రావు, సంతోష్ కుమార్, తిరుపతి, రాజశేఖర్, సురేష్, తహసీనోద్దీన్, పోలీస్ సిబ్బంది, ఎన్ జీ ఓ ప్రతినిధులు, భవన కార్మిక సంఘం నాయకులు, స్థానిక యువత, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




