సింగరేణి బీసీ అసోసియేషన్ శ్రద్ధాంజలి
నస్పూర్, ఆర్.కె న్యూస్: 42 శాతం బీసీ రిజర్వేషన్ ఉద్యమం కోసం ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారికి సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నస్పూర్ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో శ్రద్ధాంజలి ఘటించారు. అసోషియేషన్ నాయకులు సాయి ఈశ్వర చారి చిత్రపటం వద్ద కొవ్వొత్తి వెలిగించి, పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ లక్ష్య సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన సాయి ఈశ్వర చారి త్యాగం మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాన్ని సాధించే వరకు బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ నుండి ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి బరుపటి మారుతి, ట్రెజరర్ బద్రి బుచ్చయ్య, నాయకులు రఘురాం, మల్లేష్, రాందాస్, వెంగళ కుమారస్వామి, నరేష్, మదన్ తో పాటు అసోషియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



