- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా గోడప్రతుల ఆవిష్కరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న నెక్స్ ఐరా ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రం (స్టార్టప్) గోడప్రతులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మోతే శరత్ చంద్ర, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సైకాలజిస్ట్ గుండేటి యోగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మంచిర్యాలలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్సెస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డెవాప్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సాఫ్ట్వేర్ నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) సదుపాయాలను కూడా ఇక్కడ కల్పిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్కు పచ్చని మొక్కను అందించి, త్వరలో జరగనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు.



