- కాచవాని సింగారంలో డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: తెలంగాణలోని వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాచవాని సింగారంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ నూతన డైరీని రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ.. గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వయోధికులకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ కల్పించాలని, రైల్వే ప్రయాణాల్లో నిలిపివేసిన రాయితీలను తిరిగి ప్రారంభించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయోధికుల హక్కుల రక్షణ కోసం ఈ నూతన అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. డైరీ ప్రచురణలో కీలక పాత్ర పోషించిన ముత్యాల గౌడ్, కృష్ణ మూర్తిలను ఈ సందర్భంగా సంఘ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ముత్యాల గౌడ్, సంయుక్త కార్యదర్శి వి. ఇన్నా రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. కృష్ణ మూర్తి, ఘాట్ కేసర్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సభ్యులు వి. రాములు, విద్యా సాగర్, సి.హెచ్. రాములు తదితరులు పాల్గొన్నారు.





ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీస్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్-ఉమారాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ ప్రతి ఏటా మార్కండేయ జయంతితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు భగవంతుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి యాజమాన్యం తరపున ఆలయ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం, ఆలయ కమిటీ అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, మాటేటి వెంకన్న, కొండా శ్రీనివాస్, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, పెరుమాండ్ల సరోజన, చిప్ప రాజబాబు, సబ్బని భాస్కర్, కటకం లక్ష్మణ్, ఆడేటి రాజన్న, కుందారపు రాములు, క్యాతం రాజేష్, ఆడేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
