🔴 మహా ప్రస్థానం కమిటీ సభ్యుడి నివాసానికి వెళ్లి పరామర్శించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మహా ప్రస్థానం కమిటీ సభ్యుడు అప్పాల శ్రీధర్ (రాము) అకాల మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీధర్ నివాసానికి మంగళవారం ఆయన వెళ్లారు. అక్కడ మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శోకతప్త హృదయంతో ఉన్న వారికి మనోధైర్యాన్ని కల్పించారు. మహా ప్రస్థానం కమిటీలో సభ్యునిగా శ్రీధర్ అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తిని కోల్పోవడం మంచిర్యాల ప్రాంతానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



