ఎంపీడీవో రామకృష్ణ
సోన్, ఆర్.కె న్యూస్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోన్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకు దోహదపడతాయన్నారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి లత, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



