వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2కె రన్

అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవ అవగాహన ర్యాలీ, 2కె రన్  నిర్వహించారు. ఈ సందర్భంగా వనిత వాక్కు వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ రంగు వేణు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆడబిడ్డల రక్షణ తమ బాధ్యతగా భావించాలని, ఆడబిడ్డల భద్రత కోసం భరోసా కల్పించాలని అన్నారు. ఆడపిల్లల సమస్యల పరిష్కారానికి, బాలికల సాధికారత, లింగ అసమానతలను రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా 2012వ సంవత్సరం నుండి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి. ఉదయ్ కుమార్, బెల్లంపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్  కాశబోయిన సురేష్, సెవెన్ హిల్స్ హై స్కూల్ వ్యవస్థాపకులు గోనె భాగ్యలక్ష్మిలతో కలిసి జ్యోతిని వెలిగించి, 2కె రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనిత వాక్కు కో-ఫౌండర్స్ కవిత తాళ్లపల్లి, కుర్మ సునీత, జిల్లా గౌరవ అధ్యక్షురాలు జోత్స్న చంద్ర దత్, అడ్వైజరీ కమిటీ  వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ,  డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సుమన చైతన్య, చిగురు మంజుల, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్  ఉష  కాశబోయిన, మంజు భాషిని, చంద్రకళ, టౌన్ ప్రెసిడెంట్ రాచకొండ చందన, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, పద్మ, ట్రెజరర్ కొండ శైలజ, టౌన్ వైస్ ప్రెసిడెంట్, తిరుమల, పూనం, తేజస్విని, టౌన్ జనరల్ సెక్రెటరీ పద్మ, అవంతి, శారద, భవాని, వనిత వాక్కు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment