అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జీవిత చరిత్ర ఆదర్శనీయం

కుల వివక్ష, అణచివేతల నుండి విముక్తి చేస్తూ అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. గా అంబేద్కర్ జీవిత చరిత్ర ఆదర్శనీయమని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సారథ్యంలో సంఘం శరణం గచ్చామి వారిచే జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్కర్-మాత రమాబాయి ల జీవిత చరిత్ర నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ పుట్టినప్పటి నుండి వారి జీవిత ఘట్టాలను కళ్ళ ముందు ఆవిష్కరించి, కుల వివక్షలు, కుల నిర్మూలన, అణగారిన వర్గాలపై జరిగిన ఆకృత్యాలు, వీటన్నింటి నుంచి ప్రజలను విముక్తులను చేసి సర్వ హక్కులు కల్పించిన అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమైనదని తెలిపారు. దళిత సంఘాల నాయకులు ఇలాంటి కార్యక్రమాలు గ్రామ, మండల స్థాయిలో నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించి కుల వివక్షలను తొలగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్, దళిత సంఘాల నాయకులు జిల్లపెల్లి వెంకటేశం, గుడిసెల దశరథం, చెన్నూరి సమ్మయ్య, రాజ మల్లయ్య, జెట్టి చరణ్, మంచి వసతి గృహ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment