మట్టి విగ్రహాలే శ్రేయస్కరం – ఆళవందార్ వేణు మాధవ్

ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హిందువులకు ప్రకృతిలో ఉన్న నదులు, సముద్రాలు, చెట్లు, పుట్టలను, విగ్రహాలను ఆరాధించే సంప్రదాయం అనాదిగా వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యత కలదు. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు  “స్వాతంత్య్రం నా జన్మ హక్కు” అని గర్జించిన మరాఠా సింహం బాల గంగాధర తిలక్ ప్రజలను ఐక్యపరచి దేశ భక్తి,  దైవ భక్తి చాటడానికి భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. రాను రాను ఈ ఆచారం మహారాష్ట్రలోనే కాకుండా ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రాకింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో నిలబెట్టే గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం ఎత్తు పెంచుకోవడం ఒక ఆకర్షణ. కాలమాన పరిస్థితులు మారి నేడు వీధి, వీధిన ఎక్కడ చూసిన పోటీ పడి మట్టి విగ్రహాలు స్థాపించే స్థానంలో కలుషిత రంగులతో కూడిన విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది. గణేష్ నవ రాత్రుల్లో ఉత్సవాల కమిటీ వారు బలవంతంగా భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయడం మంచి పద్ధతి కాదు. భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. రంగు విగ్రహాల్లో వాడే పదార్థాలలో మెర్క్యురీ, లెడ్ ఉండటం వలన ఆరోగ్యానికి  చెడు ప్రభావం కలుగజేస్తాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం పెరిగి నీటి జీవరాసులతో పాటు ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ఈ విగ్రహాలను మురికి కాలువలు, చెత్త కుండీలు మధ్య కాకుండా, ప్రజలకు ఆటంకం లేని ప్రదేశాల్లో నిలబెట్టాలి. రాత్రి పూట కేవలం భజనలు, కీర్తనలు చేయాలి. అంతే కాని శబ్ద కాలుష్యకారకమైన డి.జె, మైకులు, సినీ పాటలు అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తే చంటి పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్ట్రీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలంకారం కొరకు వాడే విద్యుత్ తీగలు, బల్బులు ఉపయోగిస్తే ఒక్కొక్కసారి అధిక వోల్టేజ్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే అన్నదానం, నైవేద్యం తయారు చేసేటప్పుడు కల్తీ లేని నూనె, నెయ్యి, శుభ్రమైన కూరగాయలు వాడాలి. ఈ గణేష్ నవ రాత్రులలో భక్తజన సందడి ఎక్కువ కనుక డెంగ్యూ, మలేరియా సోకకుండా జాగ్రత్త వహించాలి.
———————————————————————————————————-
✍ ఆళవందార్ వేణు మాధవ్
8686051752, హైదరాబాద్

AD 01

Follow Me

images (40)

Leave a Comment