పోషకాల గని, బోడకాకరకాయ – ఎన్నో వ్యాధులకు చెక్

కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగే బోడ కాకరకాయ పోషకాల గని అని అనడంలో అతిశయోక్తి లేదు. బోడకాకరనే అడవి కాకర, ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. శరీరంలో సరైన రోగ నిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే కూరగాయలలో బోడ కాకరకాయ ఒకటి. కూరగాయలు అన్ని వేళలా దొరుకుతాయి. కానీ, బోడ కాకరకాయ మాత్రం అన్ని సమయాల్లో దొరకదు. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు బోడకాకర మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పండే ఈ బోడ కాకరకాయ కి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ప్రస్తుతం కొంతమంది ఔత్సాహిక రైతులు బోడ కాకరకాయ పంట సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోడ కాకరకాయ విరివిరిగా లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది సీజన్ కూరగాయ అవ్వడం వలన దీని ధర మిగతా కూరగాయలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కాకరకాయ ప్రస్తుతం మార్కెట్లో కిలో 300 రూపాయల వరకు ధర పలుకుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరకడం, ఎటువంటి మందులు పిచికారీ చేయకపోవడం, ఔషధ గుణాలు మెండుగా ఉండడంతో ధర కాస్త ఎక్కువైనా బోడ కాకరకాయలను తినడానికి చాలామంది భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తారు.

– బోడకాకరతో భలే ప్రయోజనాలు… ఎన్నో వ్యాధులకు చెక్…
కేవలం ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ కాకరకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బోడకాకరలో పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని, ఇందులో బి1 ,బి2, బి3 వంటి విటమిన్లు అధికంగా ఉంటాయని బోడ కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బోడ కాకర కాయలు మాత్రమే కాకుండా ఈ చెట్ల వేర్లు, ఆకుల రసాన్ని కూడా వివిధ రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. బోడ కాకరకాయలు తినడం వల్ల పోషకాలు మన శరీరానికి అంది తీవ్రమైన తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బోడకాకరలోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. గర్భిణులు బోడ కాకర కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో బోడ కాకరకాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి.

– మటన్, చికెన్ దండగ, బోడ కాకరకాయ ఉండగా…
మటన్, చికెన్‌ కంటే అత్యధిక పోషకాలు బోడ కాకరకాయలో ఉంటాయి. శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. చాలామంది శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో ఇంటికి బంధువులు వస్తే ప్రత్యేకంగా ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు.

– చికెన్ కంటే అధిక ధరకు అమ్ముడుపోతున్న బోడ కాకరకాయ
మార్కెట్లో కిలో చికెన్ ధర 200 రూపాయలు ఉండగా, కోలో బోడ కాకరకాయ ధర 300 రూపాయలు ఉన్నప్పటికీ బోడ కాకరకాయ విశిష్టత తెలిసినవారు మాత్రం కొనడానికి వెనకడుగు వేయడం లేదు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment