సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు అన్నారు. దమ్మాయిగూడ లోని సిద్ధార్థ నగర్ సీనియర్ సిటిజన్ హాల్ లో శనివారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంపుదల, అపరిమిత ఉచిత వైద్య సౌకర్యాలు  కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా  తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేయాలని కార్యవర్గం తీర్మాణం చేసింది.  కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ సభ్యులుగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, భారతీయ  మజ్దూర్ సంఘ్ ప్రతినిధిగా కొత్త కాపు లక్ష్మారెడ్డి లను నియమించడం పట్ల సభ్యులు వారికి  శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదల, వైద్య సౌకర్యాలు అపరిమితంగా కల్పించుటకు వీరు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి భూపెల్లి  బానయ్య, కోశాధికారి ఎం. విజయబాబు, ఉపాధ్యక్షుడు ఆళవందార్ వేణుమాధవ్, విజయ్ బాబు, ఉమాకర్, బీరయ్య, రఫిక్, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment