కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

ఆర్.కె న్యూస్, మంచిర్యాల:

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటాలకి పూలమాల సమర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సెప్టెంబర్ 17 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైఖ్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్ర అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వలసలతో తల్లడిల్లిన పాలమూరు కరువు నెలకు కృష్ణమ్మను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణ జలాల వాటాను పంచకుండా అన్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 1956లో ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రతో కలిపిందని, 1969లో 369 మంది యువకులను చంపిందని, 2004లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు బిఆర్ఎస్ పార్టీని చీల్చడానికి కుట్రలు చేసిందన్నారు. ఆనాడు సమైక్యవాదానికి మద్దతుగా నిలబడ్డ నేటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని అన్నారు.  రేవంత్ రెడ్డి ధరణిని తీసేస్తామని, రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అంటున్నాడన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని, రాష్ట్రం అభివృద్ధి కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కెసిఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు రాహుల్, మోతిలాల్, మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్ నాథ్ కేకన్,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు  పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment