ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రథమ చికిత్స కోర్సులో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైన 24 మంది మహిళా ఉద్యోగులకు ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందని, అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రథమ చికిత్స పై అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో వారికి ప్రథమ చికిత్స శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. శిక్షణ తరగతులు పూర్తిచేసుకుని పరీక్షలో ఉత్తీర్ణులైన సర్టిఫికెట్లు పొందడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, సింగరేణి సంస్థలో మహిళలు అన్ని పనులు చేస్తున్నారని అన్నారు. సంస్థ మహిళా ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. మహిళలు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, డివైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, వృత్తి శిక్షణా కేంద్రం ఎస్వోఎం కల్లూరి వెంకట రామారావు, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
216